వరుణ్ తేజ్ “తొలిప్రేమ” టీజర్ విడుదల...

SMTV Desk 2017-12-20 11:44:13  tholiprema teaser, varun tej new movie, venki atluri.

హైదరాబాద్, డిసెంబర్ 20: శేఖర్ కమ్ముల “ఫిదా” సినిమాతో హిట్ అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘తొలిప్రేమ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్ర టీజర్ ను చిత్రం బృందం విడుదల చేశారు. ‘మన జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా... ఫస్ట్‌ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేం.’ అని వరుణ్‌ బాధపడుతూ చెప్తున్న డైలాగ్‌ అందరిని ఆకర్షిస్తుంది. సినిమా టైటిల్ తో సాగే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు వెంకి అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, రాశి ఖన్నా కథనాయిక గా నటిస్తుంది.