నాలుగు భాషాల్లోని సన్నీ సినిమాకు పారితోషికం ఎంతో తెలుసా?

SMTV Desk 2017-12-18 17:05:18  Bollywood actress Sunny Leone, 4 languages, Prizes dimand

హైదరాబాద్‌, డిసెంబర్ 18 : దక్షిణాదిన ఓ చారిత్రక చిత్రంలో బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీ నటించబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు వడి వుడయన్‌ దర్శకత్వం వహించనున్నారు. అయితే, ఈ చిత్రం కోసం సన్నీ రూ.3.25 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ చిత్రంలో సన్నీ యువరాణి పాత్రలో నటించనుంది. తెలుగులో ఇలాంటి చిత్రంలో సన్నీ నటించడం ఇదే తొలిసారి. 2018 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది.