రాష్ట్రంలో ఉష్ణోగ్రతల వివరాలు...

SMTV Desk 2017-12-18 13:00:34  weather report, telangana, normal temperature.

హైదరాబాద్, డిసెంబర్ 18 : రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భద్రాచలం, ఖమ్మంలో 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నల్గొండలో 2 డిగ్రీలు, హకీంపేటలో ఒక డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు మహబూబ్‌నగర్‌, నిజామాబాద్ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగానే నమోదైంది. ఇక హైదరాబాద్ నగరం సహా పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ౦గానే ఉన్నాయి. రానున్న మరో 4 రోజుల పాటు పొడి వాతావరణమే కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.