ట్విట్టర్ లో చనిపోయిన రామ్ గోపాల్ వర్మ

SMTV Desk 2017-05-28 19:21:15  ramgopalvarma,twitter,death,director

హైదరాబాద్, మే 27 : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని ప్రేక్షకులు లేరు. ఆయన ఎప్పుడు ఏం చేసిన సంచలనమే. వివాదాలకు, కామెంట్లకు మారు పేరుగా నిలిచే రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు కూడా అదే సంచలనం చేశాడు. తను చనిపోతున్నట్లు చెప్పాడు. రామ్ గోపాల్ వర్మ చనిపోవడం ఏంటి అనుకుంటున్నారా, అదేం లేదు. తన ట్విట్టర్ నుండి చనిపోతున్నట్లు చెప్పాడు. ట్విట్టర్ లో తను 27-05-2007లో పుడితే 27-05-2017 ట్విట్టర్ నుండి మరణిస్తున్నట్లు చెప్పారు. 8 గంటల వరకు ఉండి, ఇన్నేళ్ళు ట్విట్టర్ లో నన్ను ఫాలో అయిన వాళ్ళందరికి నో థాంక్స్ అని చెప్పి నిష్క్రమించారు.