ఇస్రో పరిశోధనలో నగర శాస్త్రవేత్తల అనుభూతులు

SMTV Desk 2017-12-16 12:01:37  ISRO Research Center in Antarctica, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 16 : అంటార్కిటికాలోని ఇస్రో పరిశోధన కేంద్రంలో పని చేసి హైదరాబాద్ వచ్చిన శాస్త్రవేత్తల బృందానికి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళ మణి, శ్రీకాంత్, సత్యేష్‌ కుమార్ అంటార్కిటికాలోని భారతి కేంద్రంలో ఇస్రో ఉపగ్రహాల సమాచారాన్ని 14 నెలలపాటు సేకరించారు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో సవాళ్ల మధ్య ఉపగ్రహాల నుంచి సమాచారం సేకరించడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మంగళమణి మాట్లాడుతూ...మన భూభాగం నుంచి అంతరిక్షంలో పరిభ్రమించే ఉపగ్రహాలు రోజుకు రెండుమూడు సార్లకు మించి కనబడవు. కానీ, అదే అంటార్కిటికాలోని లార్స్‌మ్యాన్‌ హిల్స్‌ ప్రాంతంలోని ‘భారతి అంటార్కిటికా’ కేంద్రం నుంచి 10 నుంచి 12 సార్లు కన్పిస్తాయని ఆమె తెలిపారు.