గ్రేటర్ హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు...

SMTV Desk 2017-12-16 11:31:50  grater hyderabad, municipal corporation, international identity, solid management.

హైదరాబాద్, డిసెంబర్ 16 : హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. స్వచ్చమైన నగరం, పరిశుభ్రతలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ఈ అవార్డును దక్కించుకుంది. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో మున్సిపల్ కార్పోరేషన్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమంటూ.. తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియలో చాలా చురుకుగా పనులను చేస్తున్నందునే ఈ అవార్డు దక్కింద౦టూ గ్రేటర్ పరిధి అధికారులు వెల్లడించారు. కాగా ఈ అవార్డును 7వ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఆ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ డాక్టర్‌ సదాన్‌ కె.ఘోష్, కో చైర్మన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మైకెల్‌ నెల్లెస్ లతో పాటు సీఆర్సీ, కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఏఎంహెచ్‌ఓ, శానిటరీ సూపర్‌వైజర్‌ కు అందజేశారు.