సన్నీలియోన్ వస్తే ఆత్మహత్య ఖాయం...

SMTV Desk 2017-12-15 14:36:20  sunnyleone, happy new year event, banglore,

బెంగుళూరు, డిసెంబర్ 15: బాలీవుడ్ బామ, అందాల తార సన్నీలియోన్ గతం మంచిది కాదు అని కొందరు, ఆమెలాంటి వాళ్ళను ప్రోత్సహించడం సరికాదని మరికొందరు ఇలాంటి శ్లోకాలతో ధర్నా చేపట్టారు. బెంగుళూరులో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు రానున్న సన్నీలియోన్ కు వ్యతిరేఖంగా కర్ణాటక రక్షణ వేదిక యువసేన పిలుపునిచ్చింది. అంతేకాదు ఆమె ఈవెంట్ కి వస్తే సామూహిక ఆత్మహత్యకు వెనుకాడే ప్రసక్తే లేదంటూ నిరసనగా ఆమె పోస్టర్లు, ఫొటోలు కాల్చేశారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకుడు హరీష్ మాట్లాడుతూ... సన్నీలియోన్ సంప్రదాయ దుస్తులు ధరించి కార్యక్రమాల్లో పాల్గొంటుంటే, ఈ విధంగా అడ్డుకోవడం సబబు కాదన్నారు. ఆమెకు ఎన్నో ఆఫర్లు వచ్చినా, ఈ ఈవెంట్ కి ఆసక్తి చూపెట్టడానికి గల కారణం సన్నీకి బెంగుళూరు అంటే చాలా ఇష్టమని అన్నారు.