ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

SMTV Desk 2017-12-15 12:48:50  LB NAGAR, TRAFFIC DIVERT, TELUGU MAHA SABALU.

హైదరాబాద్, డిసెంబర్ 15 : ఈ రోజు సాయంత్రం ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈ ఎల్బీనగర్ స్టేడియం వైపు వచ్చే వాహనాలను మళ్ళించడంతో వాహనాదారులు కాస్తంత ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొని మాకు సహకరించవలసిందిగా పోలీసులు కోరుతున్నారు. ఈ మహాసభలు ఐదు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఈరోజు నుండి 17 వ తేదీ వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.