టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఉమా మాధవరెడ్డి

SMTV Desk 2017-12-14 17:11:21  Former MLA Uma Madhavareddy, Convert to TRS Party, cm KCR.

హైదరాబాద్, డిసెంబర్ 14 : టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారిని కేసీఆర్ సాదరంగా, పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమా మాధవరెడ్డి తెరాసలో చేరినందుకు ఆనందంగా ఉందన్నారు. మాధవరెడ్డి నాకు మంచి మిత్రుడని, ఉమా మాధవరెడ్డి నాకు తోబుట్టువుతో సమానం అంటూ సంబోధించారు. ఉమా మాధవరెడ్డి పార్టీలో చేరే ముందు ఎటువంటి డిమాండ్లు చేయలేదన్నారు. ఆమె మనసున్న మంచి వ్యక్తి అని కొనియాడారు. అలాగే సందీప్‌ రెడ్డికి మంచి భవిష్యత్ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.