నేడు ఏపీ సీఎంతో బీజేపీ నేతలు భేటీ...

SMTV Desk 2017-12-13 13:05:18  ap cm chandrababu naidu, bjp leaders, amaravathi

అమరావతి, డిసెంబర్ 13 : నేడు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతలు సీఎం చంద్రబాబునాయుడును కలవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుపై సమస్యలు తలలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును కలవాలని బీజేపీ నేతలు నిర్ణయిచుకున్నారు. పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రాజెక్టులపై వీరిమధ్య చర్చ జరగనున్నట్లు తెలిసింది. కాగా... పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర్నుంచి తీసుకుని ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, జలవనరుల శాఖ మంత్రిని కలవాలని రాష్ట్ర బీజేపీ నేతలు అనుకుంటున్నట్లు సమాచారం.