14 నుండి క్రిస్మస్ కానుకల పంపిణీ..

SMTV Desk 2017-12-13 10:56:59  Christmas gifts, telangana government, decembar 14, Welfare Secretary Syed Umar Jalil.

హైదరాబాద్, డిసెంబర్ 13 : తెలంగాణ ప్రభుత్వం తరఫున క్రైస్తవ సోదరులకు క్రిస్మస్‌ కానుకలను అందించనున్నారు. ఈ నెల 14 నుండి క్రిస్మస్‌ కానుకలను పంపిణీ చేయాలని రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో క్రిస్మస్‌ కానుకల పంపిణీ పనులపై ఆరా తీశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 18న క్రైస్తవ సోదరుల కోసం డిన్నర్‌ను ఏర్పాటు చేయడానికి రూ.1.95కోట్ల నిధులు విడుదల చేశారని వెల్లడించారు.