సీసీఎల్- టీ10 బ్లాస్ట్ షురూ...!

SMTV Desk 2017-12-12 16:27:36  ccl 2017, ccl t10 blast, league, new format, karnataka bull dozers, telugu warriors

ముంబాయి, డిసెంబర్ 12 : సినీ నటులు సామాజిక సేవలో భాగంగా ఏర్పాటు చేసిన (సీసీఎల్) సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మరో కొత్త ఫార్మట్ లో అలరించనుంది. ఈ లీగ్ లో 10 ఓవర్లలో పాటు 90 నిముషాలు సాగే సీసీఎల్- టీ10 బ్లాస్ట్ ను నిర్వహించనున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 24, 25, 26 ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. 2011 లో ప్రారంభమైన టీ-20 లో కర్ణాటక బుల్ డోజర్స్ , చెన్నై రైనోస్, తెలుగు వారియర్స్ 2 సార్లు విజేతగా నిలిచారు.