విజయ్ ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్

SMTV Desk 2017-12-11 16:11:25  VIJAY SAI, SUICIDE, COMEDIAN, TOLLYWOOD

హైదరాబాద్, డిసెంబర్ 11 : టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి యూసుఫ్ గూడలోని నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతడు తీసుకున్న సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తను మరణించే ముందు ఒక సెల్ఫీలో తన ఆత్మహత్యకు కారణం భార్య వనిత, శశిధర్, అని చెప్పినట్టు సమాచారం. ఈ వీడియోలో విజయ్ మాట్లాడుతూ..."వాల్‌ పోస్టర్‌ సినిమా షూటింగ్‌లో వనిత నాకు పరిచయమైంది. పెళ్లైన తర్వాత ఆమె అసలు స్వభావం నాకు తెలిసింది. వ్యాపార అవకాశాల కోసం వనితను శశిధర్‌ ఉపయోగించుకున్నాడు. నా కూతురిని కూడా చూడానివ్వ లేదు. వాళ్ల వేధింపులు తట్టుకోలేకపోయాను. వనిత లాంటి వారిని వదిలిపెట్టొద్దు. డాడీ అందరికీ శిక్ష పడేలా చూడు. ఐ లవ్‌ యూ డాడీ" అంటూ పేర్కొన్నాడు.