కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా౦ : హరీష్ రావు

SMTV Desk 2017-12-09 14:14:25  Minister Harish Rao, visited Murali family, Rs 10 lakhs ex gratia.

హైదరాబాద్, డిసెంబర్ 09 : ఓయూలో ఇటీవల మురళి అనే విద్యార్ధి నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మృతితో ఓయూలో పలు నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు మురళి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిరుద్యోగంతో మురళి చనిపోవడంతో తన అన్న రాజుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, అలాగే తల్లి లచ్చమ్మకు కూడా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.