కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా..?

SMTV Desk 2017-12-08 13:01:12  Telugu mahasabhalu, cm kcr, Virasam membar Varaara Rao

హైదరాబాద్, డిసెంబర్ 08 : తెలుగు మహాసభలను బహిష్కరిద్దాం అని పిలుపునిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. ప్రజల భాష, సంస్కృతి, సాహిత్యాన్ని పాలకులు దోచుకోవడానికే ప్రభుత్వం ఈ సభలను నిర్వహిస్తుందని ఆరోపించారు. అలాగే ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు మాట్లాడుతూ.. తెలుగు మహాసభల హోర్డింగ్‌లలో కేసీఆర్ ఫోటోను పెద్దగా వేసి, గొప్ప కళాకారుడు సుద్దాల హన్మంతు ఫోటోను చిన్నగా వేయడం చూస్తుంటే కళాకారులకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఏంటో అర్ధమవుతుందంటూ దుయ్యబట్టారు.