బాలీవుడ్ నటుడి పై దాడి

SMTV Desk 2017-12-07 14:51:51  arjun kapoor, attack by aperson, in shhoting location, pithore ghad,

ముంబాయి, డిసెంబర్ 07 : ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ పై షూటింగ్ సెట్ లో ఓ కారు డ్రైవర్ దాడి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అర్జున్‌, దివాకర్‌ బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న "సంజయ్‌ ఔర్‌ పింకీ ఫరార్‌" చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌ జిల్లాలో జరుగుతుంది. అయితే సోమవారం సన్నివేశం తెరకెక్కిస్తుండగా ఓ కారు డ్రైవర్ మద్యం తాగి సెట్‌కి వచ్చి వీరంగం చేశాడు. అంతే కాకుండా అర్జున్ దగ్గరకి వెళ్లి షేక్‌హ్యాండ్‌ కోసం ప్రయత్నించాడని, ఇందుకు అర్జున్ నిరాకరించడంతో చెయ్యి మెలితిప్పి దాడి చేసినట్లు తెలుస్తోంది. వెంటనే తేరుకున్న భద్రత సిబ్బంది అతన్ని పోలీసులుకు అప్పగించారు. దాడి చేసిన వ్యక్తి పేరు కమల్‌ అని, అతని లైసెన్సు రద్దు చేసి జరిమానా విధించామని పోలీసులు వెల్లడించారు.