తిరుమల హోటళ్ల నివేదికపై ఆగ్రహించిన హైకోర్టు...

SMTV Desk 2017-12-06 12:53:44  high court fires, Commercial Taxes Department, tirumala.

హైదరాబాద్, డిసెంబర్ 06 : తిరుమల హోటళ్లలో ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఆదేశాలు జారీ చేసి ఇన్ని రోజులవుతున్న ఇంతవరకు ఎలా౦టి స్పందన లేకపోవడంపై హైకోర్టు తప్పుపట్టింది. ఈ విషయంపై వెంటనే స్పందించి ఈ నెల 19న జరిగే విచారణకు స్వయంగా వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్‌(తిరుపతి) హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇటీవల తిరుమల రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అంతేకాకుండా ఆ పదార్థాల నాణ్యత కూడా సరిగాలేదంటూ గత ఏడాది పరిహార సేవాసమితి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్ రంగనాథన్‌, జస్టిస్‌ జి. శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.