గర్భిణి అని కూడా చూడలేదు...! చంపేశారు

SMTV Desk 2017-12-04 11:39:01  PREGNANT WOMEN DIED, RAPE, TUPRAN, VICTIM KALAVATHI

తూప్రాన్‌, డిసెంబర్ 04 : మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మరచి ఇద్దరు వ్యక్తులు ఓ గర్భిణిపై అత్యాచారానికి యత్నించాగా, వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ గర్భిణీ వాహనంలోంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని తూప్రాన్‌ మండలం రావెల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తూప్రాన్‌ మండలం రావెళ్లి పంచాయతీ పరిధి పోతరాజ్‌పల్లికి చెందిన ఉడే రేగొండ, కళావతి దంపతులు పాతదుస్తులు విక్రయ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి కూతురుతో శిరీష(8)తో కలసి హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న డీసీయం క్యాబిన్‌లో ఎక్కి తన గ్రామానికి బయలుదేరింది.అందులో ఉన్న డ్రైవరు, మరో వ్యక్తి కళావతి పట్ల అత్యాచారయత్నం చేశారు. ఈ క్రమంలోనే డీసీఎం కరీంగూడ చౌరస్తా వద్ద ఆపకుండా అతివేగంగా వెళ్తుండటంతో వాహనాన్ని ఆపాలని ఆమె కోరింది. అయినా డ్రైవర్‌ వినిపించుకోకుండా ముందుకు వెళ్లడంతో కలవరపడిన ఆమె డీసీఎం నుంచి దూకడంతో అక్కడిక్కడే మరణించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.