ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసింది : ఉత్తమ్‌కుమార్

SMTV Desk 2017-12-03 15:05:34  TPCC president Uttamkumar Reddy, GANDHIBHAVAN MEETING, SOCILA MEDIA COORDINATORS

హైదరాబాద్, డిసెంబర్ 03 : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుండి సోషల్ మీడియా కో ఆర్డినేటర్లను బూత్ స్థాయిలో నియమిస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీలో రుణమాఫీ విషయం ప్రస్తావన తర్వాత ప్రభుత్వం వ్యవసాయాధికారులకు లేఖలు రాసిందన్నారు. కాగా ఈ నెల 9న జరగనున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.