బీసీలపై వరాల జల్లు కురిపించనున్న కేసీఆర్..!

SMTV Desk 2017-12-03 11:32:24  telangana government, BC welfare, cm kcr.

హైదరాబాద్, డిసెంబర్ 03 : తెలంగాణ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి మరిన్ని పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. కాగా బీసీ విద్యార్థులకు ర్యాంకుల పరిమితి లేకుండా వారి పూర్తి ఫీజు చెల్లించేందుకు వీలుగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ నిర్ణయం అమలులోకి వస్తే రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ. 500 కోట్ల భారం పడనుంది. సుమారు వందకు పైగా కొత్త గురుకులాలను, మరో 15 డిగ్రీ కళాశాలలను మంజూరు చేసే అవకాశం ఉంది. అలాగే ఎంబీసీ కార్పోరేషన్ రుణాలపైనా నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈ సమావేశానికి ఐటీ మంత్రి కేటీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు.