ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబు..!

SMTV Desk 2017-12-01 17:12:12  Telugu mahasabhalu, kcr invited ap cm chandrababu naidu, telangana government.

హైదరాబాద్, డిసెంబర్ 01 : హైదరాబాద్ లో ఈ నెల 15వ తేదీన జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మహాసభల ప్రారంభ వేడుకలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానుండగా, ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లు పాల్గొంటారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం పాటుపడే సాహితీవేత్తలందరి సమక్షంలో ఈ తెలుగు మహాసభలను నిర్వహించనున్నారు. కాగా ఈ సభలకు మారిషస్ వైస్ ప్రెసిడెంట్, మహారాష్ట్ర గవర్నర్ లతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.