బిత్తిరి సత్తిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..

SMTV Desk 2017-11-27 16:28:59  v6 bittiri satti, Attack on the bolt with a helmet, banjarahills.

హైదరాబాద్, నవంబర్ 27 : తెలంగాణ యాసలో మాట్లాడుతూ వార్తలను ప్రజలకు చేరవేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు v6 బిత్తిరి సత్తి అలియాస్ రవి. తన గాత్రంతో అభిమానుల్లో చెరగని ముద్ర వేసిన సత్తి యాదావిధిగా మధ్యాహ్నం తన కార్యాలయానికి వెళుతున్న క్రమంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడికి దిగారు. హెల్మెట్ తో సత్తిపై దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘటనతో స్వల్పంగా గాయపడిన సత్తిని బంజారాహిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.