మహల్ ముందున్న పురాతన శిలా ఫలక౦ మూసివేత..

SMTV Desk 2017-11-27 13:30:39  padmavathi movie, chittor ghad, The stone rolling closure, allahuddin kilji.

న్యూఢిల్లీ, నవంబర్ 27 : "పద్మావతి" చిత్రంపై రోజు రోజుకి విమర్శలు పెరిగిపోతూనే ఉన్నాయి. రాజ్ పుత్ వంశస్తుల మనో భావాలు దెబ్బతినేలా కొన్ని చిత్రీకరణలు ఉన్నాయ౦టూ ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తోర్ గఢ్ కోటలోని పద్మినీ మహల్ ముందున్న ఓ పురాతన శిలా ఫలకాన్ని ఆర్కియాలజీ విభాగం అధికారులు ఇప్పుడు మూసి వేశారు. దీనికి కారణం మొగల్ రాజు అల్లాఉద్దీన్ ఖిల్జీ, స్వయంగా రాణి పద్మావతిని చూడడమే కారణంగా తెలుస్తోంది. తమ మనో భావాలను దెబ్బతీసేలా ఉన్న శిలా ఫలకాన్ని ధ్వంసం చేస్తామని శ్రీ రాజ్ పుత్ కర్ణిసేన హెచ్చరించిన నేపథ్యంలో పలు హింసాత్మక ఘటనలు జరగవచ్చని ఈ ఫలకాన్ని మూసి వేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని కర్ణిసేన ప్రతినిధులు మాత్రం స్వాగతించారు.