సోదరుడి పెళ్ళిలో హన్సిక హంగామా...

SMTV Desk 2017-11-26 17:16:25  Hansika Motwani, Hansika brother wedding,

చెన్నై, నవంబర్ 26: తెలుగు, తమిళ చిత్రాలలో తన అందంతో, అభినయనంతో కట్టిపడేసిన అందాల తార హన్సిక, తన సోదరుడి పెళ్ళిలో ఫుల్ హంగామా చేసింది. ఒకవైపు సినిమాలతోను బిజీగా ఉంటూనే, మరోవైపు సోదరుడి పెళ్ళిలో సందడి చేశారు. ఈ వేడుకలో హన్సిక, కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను హన్సిక ఇన్‌స్టాగ్రామ్‌లో... " పంజాబీ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగి౦ది. మా వదినను కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాం." అంటూ పోస్ట్‌ చేశారు. ఈ పెళ్లి వేడుకలో సినీ నటి శ్రియారెడ్డి కూడా పాల్గొన్నారు. హన్సిక ప్రస్తుతం ప్రభుదేవాతో కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు.