2018 సెలవు దినాలు ఖరారు చేసిన తెలంగాణ సర్కారు

SMTV Desk 2017-11-25 11:43:33  Government and private holidays, government, hyderabad

హైదరాబాద్, నవంబర్ 25 ‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవు దినాలు 21గా ప్రభుత్వం ఖరారు చేసింది. రానున్న ఏడాది నుంచి సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై ఈ నెల 24న రెండు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవిగాక తాము ప్రకటించిన ఐచ్ఛిక సెలవుదినాలలో ఐదింటిని ఉద్యోగులు వాడుకునేందుకు అనుమతించింది. దానికి అధీకృత ఉన్నతాధికారి నుంచి ముందస్తు అనుమతి తప్పనిరిగా సూచించింది. ఉత్తర్వుల్లోని సాధారణ సెలవుదినాలు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినవేనని, పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రజాపనుల శాఖలు, విద్యాసంస్థలకు వర్తించబోవని, వాటికి సంబంధిత శాఖలు ప్రత్యేకంగా సెలవుల జాబితాను విడుదల చేస్తాయని తెలిపింది. రెండో శనివారాలు మినహాయించి ప్రభుత్వ కార్యాలయాలకు 24 రోజులను సాధారణ సెలవులుగా, మరో 17రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది.