కమల్ పై కేసు నమోదు...

SMTV Desk 2017-11-24 18:19:37  kamal hasan, madras highcourt,

చెన్నై, నవంబర్ 24: ప్రముఖ నటుడు కమల్ హసన్, గత కొద్ది కాలంగా రాజకీయ ప్రవేశంపై ప్రచార౦ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో భాగంగా ఆయన... మన దేశంలో హిందూ ఉగ్రవాదం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోర్టు దాకా వెళ్ళాయి. తాజాగా ఓ వ్యక్తి, మద్రాస్ హైకోర్టులో ఆయనపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో.. ఈ రోజు హిందువులను ఉగ్రవాదులు అన్నారని... రేపు, ముస్లింలను లేదా క్రిస్టియన్లను ఉగ్రవాదులు అంటారని పేర్కొన్నారు. హిందువులపై ఉగ్రవాదులు అనే ముద్రను వేసి, వారికీ వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ పిటిషన్ అనుసరించి, అనుచిత వ్యాఖ్యలు చేసిన కమల్ పై కేసు నమోదు చేయాలని, చెన్నై నగర పోలీసులకు ఆదేశించి౦ది.