ఏపి పూర్తి స్థాయి డీజీపీగా సాంబశివరావు...

SMTV Desk 2017-11-24 17:47:20  ap dgp, sambashivarao, chandrababu, ap updates

అమరావతి,నవంబర్ 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా సాంబశివరావుకు పూర్తి స్థాయి బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. కాగా ప్రస్తుతం ఏపీ ఇన్‌చార్జ్ డీజీపీగా సాంబశివరావు కొనసాగుతున్న విషయం విదితమే. ఈమేరకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామక౦ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో డీజీపీ వచ్చినట్లు అయ్యింది.