గ్లోబల్ సమ్మిట్ లో రమణ గోగుల ప్రసంగం...

SMTV Desk 2017-11-24 15:47:19  ges, ramana gogula, hyderabad updates

హైదరాబాద్, నవంబర్ 24: హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ లో ముగ్గురు తెలుగువారు ప్రసంగి౦చే అవకాశం వచ్చింది. వారిలో తెలుగు వారికి సుపరిచితుడైన ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగులకు అవకాశం దక్కింది. ఆయన కు సంగీత రంగంలో కాకుండా పారిశ్రామిక రంగంలో ఈ అవకాశం రావడం విశేషం. రమణ గోగుల క్లీన్ టెక్నాలజీస్ ఇన్నోవేషన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. రైతుల జీవన ప్రమాణాలు పెంచడానికి సోలార్ అగ్రికల్చర్ ప్లాట్ ఫారం లను అబివృద్ది చేశారు. అలాగే వెంచర్ క్యాపిటల్ ఏర్పాటు, పలు స్టార్టప్ కంపెనీల స్థాపనలో రమణ కీలక పాత్ర పోషించారు. ఐఐటి ఖరగ్ పూర్ లో చదివిన రమణ ఆ తర్వాత అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. రమణతో పాటు అపోలో ఎమ్.డి సంగీతరెడ్డి, టిహబ్ సిఇఓ జయదీప్ కృష్ణన్ లకు కూడా మాట్లాడే అవకాశం వచ్చింది.