సిద్ధిపేటలో కూలిన ట్రైనింగ్ విమానం...

SMTV Desk 2017-11-24 15:39:56  Siddhipeta, Hikimpata Air Force, training aircraft,

సిద్ధిపేట, నవంబర్ 24: జిల్లాలోని దుద్దెడ సమీపంలో ట్రైనింగ్ విమానం కూలిపోయిన ఘటన చోటు చేసుకుంది. హకీంపేట ఎయిర్ ఫోర్స్ శిక్షణ కేంద్రానికి చెందిన విమానం, అత్యవసర ల్యాడింగ్ చేస్తుండగా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా పైలెట్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలి౦చారు. ఈ ప్రమాదానికి గల కారణం విమాన ఇంజన్ లో సాంకేతిక లోపమని పోలీసులు గుర్తించారు.