సీబీఐ కోర్టుకు హాజరైన జగన్!

SMTV Desk 2017-11-24 14:45:58  ys jagan, cbi court, attend

హైదరాబాద్, నవంబర్ 24: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది సేపటి కిందట నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరౌతున్న సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్ ఈ రోజు తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి కోర్టుకు హాజరయ్యారు. రేపటి నుంచి మళ్లీ యథాప్రకారం పాదయాత్ర కొనసాగిస్తారు.