ఉక్కు పరిశ్రమల ఏర్పాటుపై సమావేశం...

SMTV Desk 2017-11-24 12:14:13  steel industries, ktr, Hardip Singh Puri, bayyaram,

న్యూఢిల్లీ, నవంబర్ 24: తెలంగాణలోని బయ్యారం, ఏపీలోని కడపలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, ఏపీ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు, కేంద్ర సహాయమంత్రి సుజనా చౌదరి, సెయిల్‌, మెకాన్‌ అధికారులతో కలిసి చౌదరి బీరేంద్రసింగ్‌ కార్యదశ(టాస్క్‌ఫోర్స్‌) సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... బయ్యారంలో ఉక్కు కార్మాగార౦ ఏర్పాటుపై కేంద్ర మంత్రి వీరేంద్ర సింగ్ తో చర్చలు ఫలప్రదంగా సాగాయని అన్నారు. అరబ్ దేశాలలో సిరిసిల్లకు చెందిన కార్మికులు యుఐఈ లో శిక్ష అనుభవిస్తున్నారని, వారిని రక్షించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లానని, బాధితులను విడిపించేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వంతో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఈ నెల 28న మెట్రో రైలు ప్రారంభోత్సవానికి రావాలని గ్రుహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పూరిని కోరినట్లు తెలిపారు. రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం, ఓడిఎఫ్, వ్యర్ధాల నిర్మాణం తదితర అంశాలు హర్దిప్ సింగ్ కు వివరించినట్లు చెప్పారు. హైదరాబాద్ లో చేపట్టిన అభివృద్ధి చర్యలు హర్దిప్ సింగ్ స్వయంగా చూస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు.