డిసెంబర్ 1 నుండి జేఈఈ మెయిన్ దరఖాస్తుల స్వీకరణ...

SMTV Desk 2017-11-23 17:44:42  jee, cbse, notification, jee main

హైదరాబాద్, నవంబర్ 23: జేఈఈ మెయిన్-2018 దరఖాస్తు తేదీలను సీబీఎస్ఈ ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి జనవరి 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఫీజు చెల్లింపునకు జనవరి 2 వరకు అవకాశం కల్పించింది. www.jeemain.nic.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను ఆన్ లైన్ లో దాఖలు చేసుకోవచ్చని సూచించింది. సీబీఎస్ఈ మార్గదర్శకాల ప్రకారం ఆఫ్ లైన్లో ఏప్రిల్ 8 న , ఆన్ లైన్ లో ఏప్రిల్ 15, 16 న పరీక్షలు నిర్వహించనుంది. సిలబస్, ఇతర వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచింది. తెలంగాణాలో 6, ఆంధ్రప్రదేశ్ లో 18 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఈఈ మెయిన్ ఎగ్జాం అర్హత సాధించిన వారి నుండి 2.24 లక్షల మంది విద్యార్దులను జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కు ఎంపిక చేస్తారు. వీరిలో టాప్ 10 వేల మందికి ఐఐటీల్లో ప్రవేశం కల్పిస్తారు.