ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం...

SMTV Desk 2017-11-23 11:04:45  Fire accident, Plastic industry, hyderabad

హైదరాబాద్, నవంబర్ 23: భాగ్యనగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... భాగ్యనగరంలోని రాజేంద్రనగర్ కాటేదాన్ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి వుంది.