తెలంగాణ ఆర్టీసీలో 279 పోస్టుల భర్తీకి అనుమతి

SMTV Desk 2017-11-22 17:00:13  Telangana RTC, Replacement of 279 posts, hyderabad

హైదరాబాద్, నవంబర్ 22 ‌: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 279 పోస్టుల భర్తీకి అనుమతించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. మొత్తం 279 పోస్టుల భర్తీ కాగా, అందులో 72 జూనియర్‌ అసిస్టెంట్‌, 123 మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రెయినీ, 84 ట్రాఫిక్‌ సూపర్‌ వైజర్‌ ట్రెయినీ అనుమతి ఖరారైంది.