టీడీపీని వదిలి టీఆర్‌ఎస్ వైపుకు అడుగు వేస్తుందా...?

SMTV Desk 2017-11-21 12:12:09  TDP, TRS, Former Minister Elimineti Uma Madhavareddy, Bhuvanagiri

యాదాద్రి, నవంబరు 21 : భువనగిరి నియోజకవర్గ టీడీపీ మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మరణాంతరం ఆయన భార్య ఉమామాధవరెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చినందున ఆమె ఇటీవల టీఆర్‌ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె తన అనుచరవర్గులైన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో సోమవారం మంత్రి జగదీశ్‌రెడ్డి కలిసి సమావేశమై అభిప్రాయాలు స్వీకరించినట్లు సమాచారం. ఈ మేరకు ఉమామాధవరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడటం ఖాయమైనట్లు తెలిసింది. అయితే మరోసారి సమావేశం జరిపిన తర్వాతే ఆమె టీఆర్‌ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.