దక్షిణ భారత హిందీ ప్రచార సభలో ఉపరాష్ట్రపతి...

SMTV Desk 2017-11-19 12:24:01  Vice-President Venkiah Naidu, South Indian Hindi Press in ameerpet, hyderabad

హైదరాబాద్, నవంబర్ 19 ‌: నేడు అమీర్‌పేటలో జరిగిన దక్షిణ భారత హిందీ ప్రచార సభ విశారద స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.... దేశంలోని ప్రతి ఒక్కరూ హిందీ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భాష భావాన్ని వ్యక్తీకరించేందుకు, మానసిక వికాసానికి దోహదపడుతుందన్నారు. 1935లో విజయవాడలో దక్షిణ భారత హిందీ ప్రచారసభ స్థాపితమావ్వడంతోనే, అధ్యాపకులు, ప్రచారకులు తయారయ్యారని తెలిపారు. ఈ హిందీ ప్రచార సభల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని, దేశంలో కూడా హిందీ మాట్లాడేవారి సంఖ్యనే అధికంగా ఉందని, ఈ భాషను ఇంకా ప్రోత్సహిస్తే ముందు తరాల వారికి కూడా ఉపయోగకరమని ఆయన అభిప్రాయపడ్డారు.