మలయాళం మల్టీ స్టార్ మూవీలో వెంకటేష్..!

SMTV Desk 2017-11-18 16:07:53  venkatesh, mohanlal, malayalam movie,

హైదరాబాద్, నవంబర్ 18: వెంకటేష్-మహేశ్, వెంకటేష్-పవన్, వెంకటేష్-రామ్ ఇలా మల్టీ స్టార్ మూవీలలో నటించాలంటే వెంకటేష్ ముందుటరానడంలో అతిశయోక్తి లేదు . అయితే మలయాళంలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ తో కలిసి వెంకటేష్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మోహన్ లాల్ మలయాళంలో ఓ సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకి గాను వెంకటేశ్ ను అడగడంతో, వెంటనే ఆయన ఓకే చెప్పేశారని సినీ వర్గాలలో టాక్. ఇప్పటికే మలయాళంలో మోహన్ లాల్ సినిమాల్లో జగపతి బాబు, శ్రీకాంత్ లు కీలకమైన పాత్రలు చేశారు. ఇప్పుడు వెంకటేష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారన్న మాట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి వుంది.