ఆడుకోవాల్సిన చిన్నారి అనంత లోకాలకు...

SMTV Desk 2017-11-15 09:37:22  crime, mahabubabad, kesamudram, telangana

మహబూబాబాద్, నవంబర్ 15: పిల్లలకు సెలవులంటే పండుగ, సెలవు రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. ఆ చిన్నారి కూడా అలానే వెళ్ళాడు. కానీ ఆడుకోవాల్సిన చిన్నోడు, అనంత లోకాలకు పయనమయ్యాడు. ఈ విషాదకరమైన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కేసముద్రం మండలం అమీనాపురంలో సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంటూ వచ్చాడు ఆ చిన్నారి. అయితే ఇంటి చుట్టుపక్కల ఆ చిన్నారి ఆడుతుండగా అక్కడ తెరుచుకొని ఉన్న సంపులో పడిపోయాడు. దీంతో శ్వాస అందక ఆ చిన్నారి చనిపోయాడు. కొడుకు మృతితో ఆ తల్లి రోదనలు మిన్న౦టాయి. ఆడుకునే మనవడు ఇక లేడంటూ అమ్మమ్మ రోదనలు అందరినీ కలచివేశాయి. ఇప్పటికైనా ఇంటి చుట్టుపక్కలా పిల్లలు అడుకునేటప్పుడు సంపులను మూసి వేయండి అంటూ స్థానికులు జాగ్రత్తలు చెప్తున్నారు.