ప్రజలకు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది : ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు

SMTV Desk 2017-11-13 16:07:08  Professor Vishweshwar Rao, warangal declaration 20 years celebration.

హైదరాబాద్, నవంబర్ 13 : వరంగల్ డిక్లరేషన్ కు 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎన్నడు లేని విధంగా 3609 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్త౦ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకుండా ఉంటే ఆత్మహత్యలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలకు మాట్లాడే అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రగతి భవన్ పైరవీల భవన్ గా మారిందని, మిషన్ కాకతీయ, భగీరథ పేర్లతో కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు.