వచ్చే నెల నుంచి చైనాలో ఎలక్ట్రిక్‌ బస్సులు...

SMTV Desk 2017-11-13 15:38:33  China self-driving electric bus, Google and other car companies

బీజింగ్‌, నవంబరు 13 : ప్రస్తుతం ప్రపంచస్థాయిలో ఎక్కడ విన్న సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లపై ముమ్మరంగా చర్చలు కొనసాగుతున్నాయి. వీటిని మార్కెట్లోకి త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్‌, ఇతర కార్ల కంపెనీలు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో మూడో కంటికి తెలియకుండా చైనా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఎలక్ట్రిక్‌ బస్సులనే రూపొందించి , ఏకంగా వచ్చే నెల నుంచి వీటిని బయటకు తెచ్చే ప్రయత్నాలూ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్‌ బస్సు ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి చార్జింగ్ చేస్తే 150కి.మీ. వరకు ప్రయాణిస్తాయట. చైనాలోని హుబెయి ప్రావిన్స్‌లోని ఫ్యాక్టరీలో ఇప్పటికే ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఎలక్ట్రిక్‌ బస్సులను విజయవంతంగా పరీక్షించారు. త్వరలో షెంజెన్‌, గువాండ్‌గంగ్‌ ప్రాంతాల్లోని రహదారులపై కూడా వీటిని పరీక్షించనున్నట్లు సమాచారం.