ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో వాకింగ్‌ చేసిన కడియం శ్రీహరి...

SMTV Desk 2017-11-12 13:01:11  Deputy Chief Minister Kadiyam Srihari, varangal, Arts College Playground, Shuttle badminton, volleyball

వరంగల్‌, నవంబర్ 12 : ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈరోజు ఉదయం వరంగల్‌లో వాకర్స్‌తో కలిసి షటిల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ ఉల్లాసంగా ఆడారు. వివిధ పనులతో తీరిక లేకుండా ఉండే కడియం శ్రీహరి హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, వరంగల్‌ మేయర్‌ నరేందర్‌తో కలిసి కొంతసేపు వాకింగ్‌ చేసిన అనంతరం వాకర్స్‌తో కలిసి షటిల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ ఆడారు. ఈ సందర్భంగా మీడియాతో కలుపుగోలుగా ముచ్చటిస్తూ...వాకర్స్‌ కోసం మైదానంలో సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ట్స్‌ కళాశాల మైదానం ట్రాక్స్‌ను ఒక అందమైన ట్రాక్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు.