తుద్ది మెరుగులతో మెట్రో రైలు...

SMTV Desk 2017-11-12 12:23:41  metro rain, hyderabad, modi, telangana government

హైదరాబాద్, నవంబర్ 12 : మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థతో హైదరాబాద్ మెట్రో తుది మెరుగులు దిద్దుకుంటుంది. భారత ప్రధాని ఇచ్చే సమయం ఆధారంగా ఈ నెల 28న మెట్రోరైలు ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న మెట్రో రైలు ఇక త్వరలో రానుంది. ఈ మెట్రో రైలు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు తిరుగుతుంది. ప్రయాణికులు ఆహార పదార్థాలను వెంట తీసుకువెళ్లవచ్చు గానీ రైల్లో తినకూడదు. నాగోలు స్టేషన్‌ దాదాపు రెండు అంతస్తుల్లో 15 వేల చదరపు అడగుల విస్తీర్ణంలో నిర్మితమైంది. ఈ ప్రాంతంలోనే దాదాపు 50 వరకు శక్తివంతమైన సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. స్టేషన్ల దగ్గర పోలీసుల రక్షణే కాకుండా ఎల్‌అండ్‌టీ కూడా ప్రత్యేకంగా శిక్షణ పొందిన గార్డులను ఏర్పాటు చేసింది. స్టేషన్‌లోపల ప్రత్యేక అగ్నినిరోధక వ్యవస్థతోపాటు అత్యవసర ద్వారాలనూ ఏర్పాటు చేశారు. రెండు అంతస్తుల్లో నిర్మితమైన ఈ స్టేషన్లలో చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే రక్షణ ఏర్పాట్లు చేశారు. మొదటి అంతస్తులో కొంత భాగంలోనే టికెట్‌ లేకుండా వెళ్లొచ్చు. తరువాత నుంచి టికెట్‌ కొనుగోలు చేస్తేనే గానీ మొదటి అంతస్తులోని మిగిలిన భాగంలోకి వెళ్లడానికి అవకాశం లేదు. మొదటి అంతస్తు స్టేషన్‌కు రెండువైపులా రెండేసి ఎస్కలేటర్లు, లిఫ్టులతోపాటు మెట్ల దారి కూడా ఏర్పాటు చేశారు. ఉచితంగా తిరిగే ప్రాంతం దాటి టికెట్‌ తీసుకుని లోపలికి వచ్చే మొదటి అంతస్తును కాన్కొర్స లెవెల్‌ అంటారు. ప్రయాణికులు ఉచితంగా తిరిగే ప్రాంతంలో కొన్ని షాపులను కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నారు.