ఇంచార్జ్ డీజీపీగా మహేందర్ రెడ్డి నియామకం..

SMTV Desk 2017-11-10 16:31:17  in charge dgp, mahendhar reddy, former dgp anurag sharma.

హైదరాబాద్, నవంబర్ 10 : హైదరాబాద్ డీజీపీ అనురాగ్ శర్మ ఈ నెల 12 వ తేదీన పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఇంచార్జ్ డీజీపీగా నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి నియామకం ఖరారైంది. అనురాగ్ శర్మ పదవి విరమణ రోజే మహేందర్ రెడ్డి ఇంచార్జ్ డీజీపీగా బాధ్యతలను నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మహేందర్ రెడ్డి ఐపీఎస్ గా కరీంనగర్, గుంటూరు, ఆదిలాబాద్, నిజామాబాద్, కర్నూల్ జిల్లాలో విధులు నిర్వర్తించారు.