విశాఖలో గర్జిస్తున్న ‘జై సింహ’

SMTV Desk 2017-11-09 11:46:05  balayya movie, balakrishna 102 movie updates, nayatara, natasha dohi, hari priya

విశాఖపట్నం, నవంబర్ 09: ఈ సంవత్సరం సంక్రాంతికి “సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా..” అంటూ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో పేక్షకులకు చరిత్రను గుర్తు చేసిన బాలయ్య వచ్చే సంక్రాంతి కి ‘జై సింహ’ గా మన ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను విశాఖలో చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ - నయనతార కాంబినేషన్లో కొన్ని సీన్స్ ను చిత్రీకరించిన డైరెక్టర్, బాలకృష్ణ - హరిప్రియ ల సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను 2018 జనవరి12న బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు.