దేశాన్ని జల్లడపడుతున్న బ్రిటన్...23 వేల మంది ఉగ్రవాదుల గుర్తింపు..

SMTV Desk 2017-05-28 17:05:26  britan,terror in britan,manchestar,salman abedi

ప్రపంచానికే దశ,దిశగా వ్యవహరించే బ్రిటన్ లో ఉగ్రదాడి నైపధ్యంలో అప్రమత్తత తీవ్రమైంది.దేశంలోని పారిశ్రామిక ప్రాంతమైన మాంచేస్టార్ లో గత వారం పేలుడు జరిగిన విషయం తెలిసిందే.ఆ ఉగ్రవాద చర్యతో ఉలిక్కిపడిన ఆ దేశం పేలుళ్ళకు పాల్పడిన సల్మాన్ అబేది పుటేజ్ ను విడదల చేయడంతో పాటు తనిఖీలను ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా ఆదేశ నిఘా సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం 23 వేల మంది ఉగ్రవాదులు ఆ దేశంలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అందులో 3 వేల మంది ద్వారా తీవ్రమైన అపాయం తలెత్తే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో బ్రిటన్ పోలిసులు రంగంలోకి దిగి అరెస్ట్ లు పర్వం ప్రారంభించారు.