ఏపీ అధికారులపై గవర్నర్ ప్రశంసలు

SMTV Desk 2017-11-06 14:32:26  Governor Narasimhan, AP Chief Minister Chandrababu Naidu, Telly Conference

అమరావతి, నవంబర్ 06 : జల సంరక్షణ, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి హామీ పథకాన్ని సమర్ధంగా వినియోగించుకోవాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ సూచించారు. ఆయన ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చేపట్టిన నీరు-ప్రగతి పనుల నిర్వహణపై అధికారులను ప్రశంసించారు. వర్షాలపై అన్ని వేళలా ఆధారపడలేమని, నీటి పొదుపు, సమర్ధ నీటి నిర్వహణపై రైతులను చైతన్య పరచాలని సూచించారు. వ్యవసాయంలో సుస్థిర ఆదాయం ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.