హిందీ ట్యూషన్ కు మిల్కీ బ్యూటీ

SMTV Desk 2017-11-06 13:34:16  TAMANNAAH, BOLLYWOOD INDUSTRY,

హైదరాబాద్, నవంబర్ 6 : నటనలో తమకంటూ ఓ మంచి గుర్తింపు సాధించుకున్న నటీనటులలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. నటనలోనే కాకుండా భాషలలో కూడా ప్రావీణ్యం సంపాదించేందుకు ఈ అమ్మడు ప్రయత్నిస్తుంది. తెలుగు తెరపై మంచి మంచి సినిమాలతో అలరించిన తమన్నా, ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో తన నటనను కనబరిచేందుకు హిందీ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. హిందీని సులభంగా బోధించే మహారాష్ట్ర శివసేన నేత, వినయ్ శుక్లా దగ్గర ట్యూషన్ కు చేరింది ఈ సుందరి.