మహేశ్ బావ సుధీర్ బాబు పాంచ్ పటాకా

SMTV Desk 2017-11-04 17:06:53  Sudheer Babu, Next movie list, Director indrasena, own production.

హైదరాబాద్, నవంబర్ 04 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బావ సుధీర్ బాబు పాంచ్ పటాకా పేల్చాడు. గతంలో ఏ హీరో ప్రకటించని విధంగా ఒకేసారి ఏకంగా ఐదు ప్రాజెక్టుల వివరాలని ప్రకటించి అందరికి షాకిచ్చాడు. ఇప్పటి వరకు 7 సినిమాలు చేసిన సుధీర్ బాబు, తన ఎనిమిదో చిత్రాన్ని నూతన దర్శకుడు ఇంద్రసేనతో కలిసి చేయనున్నాడట. ఇక తన 9వ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రాజశేఖర్ దర్శకత్వంలో చేయనున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి హీరోయిన్ గా, శ్రీదేవి మూవీస్ సంస్థలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తన 10వ చిత్రాన్ని చేయనున్నాడు సుధీర్ బాబు. ఇక తన 11వ చిత్రం సస్పెన్స్ అని చెప్పిన సుధీర్, 12వ చిత్రాన్ని రచయిత నుండి డైరెక్టర్ గా టర్న్ తీసుకున్న హర్షవర్ధన్ దర్శకత్వంలో ద్వి భాషా చిత్రంగా చేయనున్నాడు. ఏదేమైనా సుధీర్ బాబు ప్రకటి౦చిన సినిమాల లిస్టు గురించి టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.