ఈ దేవ కన్య ఎవరు...!

SMTV Desk 2017-10-31 18:50:57  NAYANTARA, VELAKKARAN, RAJASTHAN

హైదరాబాద్, అక్టోబర్ 31: శ్వేత వర్ణపు దుస్తులు ధరించి దివి నుంచి దిగి వచ్చిన అతి లోక సుందరిలా ఉంది. ఇంతకీ ఎవరీ దేవ కన్య అనుకుంటున్నారా..? కేరళలో పుట్టిన ఈ కుట్టి, ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర కథానాయిక జాబితాలో ఒకరిగా పేరొందిన సితార.. మనందరీ అభిమాన తార నయన తార. ప్రస్తుతం శివకార్తికేయన్‌, నయనతార జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘వేలక్కారణ్‌’ చిత్రీకరణ రాజస్థాన్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడ తీసిన ఫొటోను నయనతార ఫ్యాషన్‌ డిజైనర్‌ నీరజ కోన ట్వీట్‌ చేశారు. ఈ ఫోటోలో దేవ కన్యలా ఉన్న నయన తార నెటిజన్లను ఆకర్షిస్తోంది