విదేశాల్లో నివసిస్తున్న వారికి అండ

SMTV Desk 2017-06-09 10:51:13  susmha swaraj, twitter, karan sine, foreign minisree

న్యూఢిల్లీ, జూన్ 08‌ : భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు సాయం అందించడంలో తన ప్రత్యేకతను చాటుతూ నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. కనీసం సమాచారం అందినా, ట్వీట్ చేసినా విదేశాల్లో ఇబ్బంది పడుతున్న భారతీయుల పట్ల ఆమె అపూర్వంగా స్పందిస్తు వారికి చేయూతను అందిస్తున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయులకు అక్కడ ఉండే భారత దౌత్య కార్యాలయాలే స్వేహితుల వంటివని ఆమె వ్యాఖ్యానించారు కూడా. ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కడి భారత దౌత్యాధికారులు మీకు ఎప్పుడూ సాయం చేసేందుకు ముందుంటారని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటనకు కరణ్ సైనీ అనే నెటిజన్ సరదా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు సయితం ఆమె స్పదించారు. నేను మార్స్ లో చిక్కుకుపోయాను..మంగళయాన్ ద్వారా ఆహారం పంపించండి..మంగళయాన్-2 ఎప్పుడు పంపిస్తారు అంటూ ట్వీట్ చేశారు. అందుకు స్పందించిన సుష్మా స్వరాజ్ ..మీరు మార్స్ లో చిక్కుకుపోయినా భారత దౌత్య కార్యాలయం మీకు సహాయం అందిస్తుంది అని ట్వీట్ చేశారు. కుల, మత, ప్రాంతీయ తారతమ్యాలు లేకుండా విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సుష్మా స్వరాజ్‌ ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఇటీవలే ఓ పాక్‌ జాతీయుడు ‘నా బిడ్డకు ఆపరేషన్‌ చేయిం చేందుకు భారత్‌ తీసుకురావాలి. అందుకోసం మెడికల్‌ వీసా మంజూరు చేయాల్సిందిగా’ కోరుతూ ట్వీట్‌ చేశారు. అందుకు వెంటనే స్పందించిన ఆమె పాక్‌ బాలుడికి మెడికల్‌ వీసా మంజూరు చేయించి మాన వతను, సహృదయతను చాటారు.